సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు

3చూసినవారు
మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన “ప్రజావాణి”లో కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజల వినతులు స్వీకరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూవివాదాలు, పింఛన్ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం చేయాలని, పెండింగ్ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్