బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడం
కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు. మహిళలపై కాంగ్రెస్కు నిజమైన నిబద్ధత లేదని, కేవలం కపట ప్రేమ మాత్రమే ఉందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మల్లేశ్ గౌడ్ విమర్శించారు.