గణపతి హోమంలో భక్తుల సందడి

6చూసినవారు
గణపతి హోమంలో భక్తుల సందడి
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో భక్తి సందడి నెలకొంది. పెద్ద పైడి రెడ్డి పరివార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముత్తయిదువులు ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది. ఈకార్యక్రమంలో పెద్ద పైడి రెడ్డి పరివార్ సభ్యులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్