మెదక్ జిల్లా ప్రజలు సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.