మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. తాము రాముడి వారసులమని, 'జై శ్రీరామ్' అంటామని, 'జై సోనియా', 'జై ఇందిరమ్మ' అంటే డబ్బులు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీ పేరు వినగానే ఇటలీ, ఇందిరా గాంధీ పేరు వినగానే ఎమర్జెన్సీ గుర్తుకు వస్తాయని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.