రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2026లో రిటైర్డ్ పీడీ డా.కే.ప్రభు లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. గత నెలలో కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ప్రభు, జాతీయ స్థాయిలోనూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఆయన మెడల్ సాధించడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు, గుల్షన్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు.