చేగుంట మండలం బోనాల శివారులో గజ్వేల్–రామాయంపేట ప్రధాన రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.