రామాయంపేటలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, అభివృద్ధి-సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఐకమత్యంతో కృషి చేస్తే మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.