ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

0చూసినవారు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గురువారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :