యజమాని జీతం ఇవ్వడం లేదని వెంచర్‌లో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నార్సింగ్ శివారులోని ఓ వెంచర్‌లో లకావత్ రాజు పనిచేస్తున్నారు. తాను పనిచేసినా డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం చెందిన రాజు వెంచర్‌లోనే ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు చేగుంట మండలం చెట్ల తిమ్మయి పల్లి వాసిగా గుర్తించారు. కాగా రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.