బస్ షెల్టర్‌లో సామగ్రి.. ప్రయాణికులు రోడ్డుపైనే..!

1చూసినవారు
బస్ షెల్టర్‌లో సామగ్రి.. ప్రయాణికులు రోడ్డుపైనే..!
నర్సాపూర్ నియోజకవర్గంలోని వెంకటాపూర్ గ్రామంలో బస్ షెల్టర్ ప్రయాణికులకు కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి చెందిన సామగ్రి నిల్వ కేంద్రంగా మారింది. షెల్టర్ పూర్తిగా సామగ్రితో నిండిపోవడంతో ప్రయాణికులు ఎండ, వానల్లో బయటే నిరీక్షించాల్సి వస్తోంది. అధికారులు వెంటనే సామగ్రిని తొలగించి బస్ షెల్టర్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్