వరి ధాన్యం తూకం వేసి పక్షం రోజులు గడిచినా రైస్ మిల్లులకు తరలించకపోవడంతో ఐకేపీ అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లాదుర్గం మండలంలోని చిల్వర్ ఐబీ చౌరస్తా వద్ద ఆరబోసిన రైతుల ధాన్యంతో పాటు తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐకేపీ అధికారి రుక్మిణిని రైతులు నిలదీశారు.