తోటి కోడళ్లు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ

తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఎన్నికల బరిలో తోటి కోడళ్లు పోటీ పడుతున్నారు. 12వ వార్డు నుంచి తాజా మాజీ కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ పోటీ చేస్తుండగా, ఆమె తోటి కోడలు బొంది రజిని రాఘవేందర్ గౌడ్ 1వ వార్డు నుంచి బరిలో నిలిచారు. రజిని భర్త రాఘవేందర్ గౌడ్ ఇదే వార్డులో తాజా మాజీ కౌన్సిలర్‌గా ఉన్నారు.
