టాస్క్ ఫోర్స్ తనిఖీలతో అప్రమత్తమైన ఎరువుల దుకాణాలు

0చూసినవారు
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో నిల్వలు, విక్రయ రికార్డులు, లైసెన్సులు తదితర వివరాలను పరిశీలించి నిబంధనల అమలుపై ఆరా తీశారు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే ఈ పరిశీలనలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు యూరియా కొనుగోలు సమయంలో తప్పనిసరిగా అధికారిక యాప్‌ను ఉపయోగించాలని సూచించారు.

ట్యాగ్స్ :