రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.