మెదక్ డైట్‌కు రూ. 11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన: ఎంపీ

4చూసినవారు
మెదక్ జిల్లా డైట్ కళాశాల ప్రాంగణంలో రూ. 11 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. డైట్ ఎక్సలెన్సీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కళాశాలలో మౌలిక వసతులను బలోపేతం చేయనున్నారు. ఈ పనుల ద్వారా ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెరిగి, విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.