నాణ్యతా ప్రమాణాలతోనే ధాన్యం కొనుగోళ్లు - తహసిల్దార్ శ్రీనివాస్

1చూసినవారు
నాణ్యతా ప్రమాణాలతోనే ధాన్యం కొనుగోళ్లు - తహసిల్దార్ శ్రీనివాస్
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ధాన్యానికి కనీస మద్దతు ధర లభిస్తుందని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, తాలు, చెత్త, మట్టిపెళ్లలు, రాళ్లు లేకుండా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని చల్మెడ, జెడ్‌ చెరువు తాండ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు మల్లేశం, బాబు నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్