పంట చేతికొచ్చిన వేళ దళారుల వలలో పడి రైతులు నష్టపోవద్దని సర్పంచ్ ప్రవీణ్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. మండలంలోని రాంపూర్‌లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి కేంద్రాలకు తీసుకురావాలని, ప్రభుత్వం కల్పిస్తున్న కొనుగోలు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను ఆశ్రయిస్తే పంటకు సరైన ధర దక్కక నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.