నిజాంపేట మండలం వెంకటాపూర్ తండాకు చెందిన గర్భిణి కవితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు పెరిగాయి. ఈఎంటీ స్వామి అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.