హవేలి ఘనాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితమే కుల్చారం పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, విధుల్లో ఉండగా ఛాతిలో తీవ్ర నొప్పిగా ఉందని సహచరులకు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన ఆకస్మిక మరణంతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి.