స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ అభ్యర్థులు హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సోమవారం సూచించారు. నిజాంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆయన, అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులకు సహాయం అందించడమే హెల్ప్ డెస్క్ ముఖ్య ఉద్దేశ్యం.