జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఆర్‌ఐ శైలేందర్ తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరస్పరం రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు శాంతి, సామరస్యాల మధ్య హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.