భారీ వర్షాలకు కూలిన ఇల్లు

0చూసినవారు
భారీ వర్షాలకు కూలిన ఇల్లు
మెదక్ జిల్లా, నిజాంపేట మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా మంగళవారం ఎదుగని శ్రీనివాస్-రుక్మిణి దంపతుల ఇల్లు కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడంతో ఆ దంపతులు బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు. ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ గృహం మంజూరు చేసి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్