రామాయంపేటలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పు చేయకపోతే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయని, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోందని, చేసిన తప్పును అంగీకరించాలని డిమాండ్ చేశారు.