రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక నిల్వలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ రజనీకుమారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన ఇసుక డంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వలు లేదా రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.