చిన్నశంకరంపేట మండలంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించాలని, ప్రజలు అభివృద్ధి–సంక్షేమాల కోసం కాంగ్రెస్‌ను మరింత బలపరచాలని వారు కోరారు. ఈ చేరికల కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమణ, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.