ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని, అందుకే పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని అన్నారు. బుధవారం శంకరంపేట్‌లో ఆరేపల్లి మాజీ సర్పంచ్ శంకర్ రావుతో సహా దాదాపు 50 మంది బీజేపీ పార్టీలో చేరారు. వారికి విజయపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.