వట్పల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సమీప బంధువులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన రెండు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి యువతిని సురక్షితంగా కాపాడారు. ఎస్సై లవ్ కుమార్ నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు, గ్రామంలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.