అక్షరమే ఆయుధం.. ప్రతి మహిళ చదువుకోవాలి!

0చూసినవారు
అక్షరమే ఆయుధం.. ప్రతి మహిళ చదువుకోవాలి!
మహిళల జీవితాల్లో అక్షరాస్యత వెలుగులు నింపాలని, ప్రతి మహిళ చదువుకోవాలని ఏపీఎం అశోక్‌ పిలుపునిచ్చారు. చదువు ద్వారా మహిళలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవడంతో పాటు స్వావలంబన సాధించవచ్చన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామైక్య సమాఖ్య సంఘ సభ్యులకు ‘ఉల్లాస్‌’ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళలకు చదువు నేర్పించి, వాలంటీర్లకు రాత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చలిమేటి నరేందర్‌, వీఓఏలు లక్ష్మి, సౌందర్య, పద్మ, వనజ, రాణి, లెర్నర్సలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్