మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో మొత్తం 183 సర్పంచ్ స్థానాలకు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.