బాసర ట్రిపుల్ ఐటీకి మెదక్ జిల్లా నుంచి 78 విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.