మహిళా శక్తి పథకంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.