మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మద్యానికి బానిసైన క్యాదరి నర్సయ్య (67) అనే వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్టోబర్ 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన నర్సయ్య ఆచూకీ లభించలేదు. శుక్రవారం అతని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో పొలం వద్ద చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.