మెదక్ జిల్లా సివిల్ సప్లై అధికారిగా నిత్యానందం శుక్రవారం మెదక్ లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రేషన్ బియ్యం సరిగా అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈనెల 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.