మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

1చూసినవారు
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల ప్రాంతానికి చెందిన గుంటుక లక్ష్మినారాయణ రెడ్డి (57) ఆదివారం సాయంత్రం బైక్‌పై మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తుండగా, కాళ్లకల్ జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.