మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం శివారు పెద్దచెరువు వద్ద సోమవారం చేపల వేటకు వెళ్లి నేనవత్ లచ్చు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. లచ్చు, హరి, బాల్యతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లగా, ఈ దుర్ఘటన జరిగింది. గమనించిన హరి, బాల్య లచ్చును బయటకు తీసేలోపే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పంచనామా కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.