మీసేవ కేంద్రాల ఛార్జీలు పెంపు: రూ.35 నుంచి రూ.62కు

0చూసినవారు
మీసేవ కేంద్రాల ఛార్జీలు పెంపు: రూ.35 నుంచి రూ.62కు
మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మీసేవ కేంద్రాల ఛార్జీలను పెంచారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగింది. A కేటగిరీ సేవలకు రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా మీసేవ కేంద్రాలు పనిచేయవని తెలిపారు.

సంబంధిత పోస్ట్