రామాయంపేట మండలం సుతార్పల్లిలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.