ధాన్యం కొనుగోలు ఆలస్యం పై ఎమ్మెల్యే ఆగ్రహం

4చూసినవారు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన ఆరోపించారు. గురువారం నార్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :