హవేలిఘనపూర్ మండలంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించారు. అకాల వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి, రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం, జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు స్వీకరించాలని ఆదేశించారు.