మెదక్ పట్టణంలో కోతుల దాడి కలకలం రేపింది. కుమ్మరిగడ్డ వీధికి చెందిన కుమ్మరి సంతోష్ ఎంసీహెచ్ ఆసుపత్రికి వెళ్తుండగా, ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయం సమీపంలో కోతుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో సంతోష్‌కి చెయ్యి విరిగినట్లు సమాచారం. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కోతుల బెడద తగ్గించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.