రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో, పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని, పోలింగ్‌కు ముందురోజు ఉదయం 9 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల నిబంధనలు, కోడ్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.