రేగోడ్ మండలం కొత్వాల్పల్లిలో SI పోచయ్య నేతృత్వంలో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు నిర్వహించింది. గ్రామంలోని కిరాణా, కల్లు దుకాణాలను పోలీసులు పరిశీలించి, మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై దృష్టి సారించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలు లభిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.