చిన్నశంకరంపేట మండలంలో నూతన పట్టాదారులైన రైతులు రైతు భరోసా పథకం ప్రయోజనాలను పొందడానికి జూలై 5లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ మధులిక సోమవారం సూచించారు. రైతులు తమ గ్రామంలోని రైతు వేదిక వద్దకు వచ్చి, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లతో పాటు మొబైల్ ఫోన్‌ను తీసుకువచ్చి దరఖాస్తు సమర్పించాలని ఆమె కోరారు.