రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు

0చూసినవారు
తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం అన్యాయమని బీఆర్ఎస్ నేత కంటరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. రామాయంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారని, తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిపై ఇలాంటి చర్యలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్