దంపతుల వద్ద రూ. 30 లక్షలపైగా స్వాధీనం

6చూసినవారు
దంపతుల వద్ద రూ. 30 లక్షలపైగా స్వాధీనం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మకరాజుపేట చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక ద్విచక్ర వాహనం వెనుక భాగంలో ఉన్న బ్యాగులో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. తదుపరి పరిశీలనలో రూ. 30.59 లక్షల నగదు బయటపడింది. ఈ డబ్బును గజ్వేల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దంపతుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. పొలం అమ్మకం ద్వారా వచ్చినదని వారు తెలిపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్