చిన్న శంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై శివానందం సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.