జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రత్యేక సందేశంగా తన ఇద్దరు కుమార్తెలకు క్యాంపు కార్యాలయంలో స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.