మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామ మహిళా సమైక్య సంఘం భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ కాపీని
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగరాజు అందజేశారు. ఈ సందర్భంగా వివో కవిత మాట్లాడుతూ, సమావేశాలకు శాశ్వత స్థలం లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తై మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపాయగపడుతుందాన్నారు.