మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం రుద్రారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ రమాదేవి సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆర్డీఓ రమాదేవి స్పష్టం చేశారు.